Sabitha Indra Reddy Started Development Programmes : ప్రజలే నా బలం - బలగం, సమగ్రాభివృద్ధే నా లక్ష్యం: సబితా ఇంద్రారెడ్డి - తెలంగాణ తాజా రాజకీయ వార్తలు
🎬 Watch Now: Feature Video
Published : Aug 28, 2023, 4:03 PM IST
|Updated : Aug 28, 2023, 5:32 PM IST
Sabitha Indra Reddy Started Development Programmes in Badangpet : మహేశ్వరం నియోజకవర్గంలో విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. బడంగ్పేట్ కార్పొరేషన్లో రూ. 12 కోట్ల 38 లక్షలతో 60 కార్యక్రమాలకు ఒకే రోజు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. సంక్షేమం, అభివృద్ధిలో తెలంగాణ నంబర్ వన్ అని.. దేశానికే తెలంగాణ పథకాలు ఆదర్శంగా ఉన్నాయన్నారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ముఖ్యమంత్రి కేసీఆర్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ సహకారంతో మహేశ్వరం నియోజకవర్గంలోని రెండు కార్పొరేషన్లు, రెండు మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి మహేశ్వరం పర్యటనలో విడుదల చేసిన రూ.150 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపడతామని, బడంగ్ పేట్ కార్పొరేషన్‌కు మంజూరు అయిన రూ.50 కోట్లతో మరికొన్ని పనులు రూపొందించి త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు.
BRS Devolopments in Maheshwaram : కార్పొరేషన్ పరిధిలో ట్రంక్ లైన్లు, నాలాల నిర్మాణాలతో వరదనీటి ముంపు సమస్యలకు పరిష్కారం చూపుతున్నట్లు మంత్రి తెలిపారు. నాలాల అభివృద్ధికి రూ.110 కోట్లతో మహేశ్వరం నియోజకవర్గంలో పనులు జరుగుతున్నాయని ప్రకటించారు. నియోజకవర్గంలోని బడంగ్పేట్, మీర్ పేట్, జల్ పల్లి, తుక్కుగూడల పరిధిలోని 11 చెరువులకు రూ.47 కోట్ల అభివృద్ధి, సుందరీకరణ పనులు చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు. సంక్షేమం-అభివృద్దే నినాదాలుగా రెండు కళ్లలాగా చూస్తూ మహేశ్వరం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలపడానికి కృషి చేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. నియోజకవర్గానికి వేల కోట్ల నిధులు ఇస్తున్న కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మరొక సారి ఆశీర్వదించాలని ప్రజలకు మంత్రి విజ్ఞప్తి చేశారు.