Sabbitham Waterfalls : పర్యాటకులకు అలర్ట్.. సబ్బితం జలపాతం సందర్శనకు నో ఎంట్రీ - Sabbitham Waterfalls no entry
🎬 Watch Now: Feature Video
Sabbitham Waterfalls No Entry : పెద్దపల్లి జిల్లాలోని సబ్బితం జలపాతం నయగారను తలపిస్తూ కనువిందు చేస్తోంది. దట్టమైన అడవిలో, చుట్టూ పచ్చని కొండల నడుమ వయ్యారంగా వంపులు తిరుగుతూ ఈ జలపాతం పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తోంది. ముఖ్యంగా ఇటీవల కురిసిన వర్షాలకు పై నుంచి జలసవ్వడులు ఉద్ధృతంగా పడుతూ మరింత మనోహరంగా దర్శనమిస్తున్నాయి. అయితే ఇటీవల జలపాతం సందర్శనకు వచ్చిన ఓ సందర్శకుడు అందులో పడి మరణించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. తాజాగా జలపాతం సందర్శనను నిలిపివేశారు. జలపాతానికి వెళ్లే మార్గంలో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అలాగే జలపాతానికి వెళ్లకుండా పోలీస్ సిబ్బందిని సైతం నియమించారు. గతేడాది ఈ జలపాతంలో నీట మునిగి పదిమందికి పైగా చనిపోయారు. తాజాగా రెండు రోజుల క్రితం మరో యువకుడు నీట మునిగి మరణించాడు. సందర్శకులు ఎవరూ జలపాతానికి రావద్దని పోలీసులు సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారాలు నిర్వహిస్తున్నారు. ఈ జలపాతం వద్ద సరదాగా గడిపేందుకు వారాంతాల్లో పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్న ప్రజలు అసలు విషయం తెలిసి తిరుగుపయనమవుతున్నారు.