RTC Bus Accident Hyderabad Live Video : సిగ్నల్ వద్ద ఆగిన ఆటోను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. వీడియో వైరల్ - Hyderabad rtc bus accident Reason
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/25-09-2023/640-480-19599522--thumbnail-16x9-bus-accident-in-hyderabad.jpg)
![ETV Bharat Telangana Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telangana-1716536068.jpeg)
Published : Sep 25, 2023, 11:06 AM IST
RTC Bus Accident Hyderabad Live Video : సిగ్నల్ వద్ద ఆగి ఉన్న ఆటోను వెనకాల నుంచి వచ్చిన బస్సు ఢీ కొట్టింది. దీంతో ఆటోలో ఉన్న నలుగురు ప్రయాణికులకి గాయాలయ్యాయి. ఈ ఘటన హైదరాబాద్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్లోని పాతబస్తీ బహదూర్పూరా క్రాస్ రోడ్డు దగ్గర సిగ్నల్ పడడంతో వావానాలు ఆగాయి. ఇంతలో వెనకాల నుంచి రాజేంద్రనగర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఆగి ఉన్న ఆటోను ఢీ కొట్టింది. బస్సు ఢీ కొట్టడంతో ఒక్కసారిగా ఆటో ముందుకు దూసుకెళ్లింది. ఈ క్రమంలో ఆటోలో ఉన్న నలుగురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. అక్కడే ఉన్న తోటి ప్రయాణికులు వారికి ప్రాథమిక చికిత్స చేసి పోలీసులకు సమాచారం అందించారు.
RTC Bus Hits Auto At Traffic Signal Hyderabad : ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. మరోవైపు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. వీడియోలో డ్రైవర్ కావాలనే ఆటోను ఢీకొట్టినట్లు కనిపించగా.. ఆ విషయంపై పోలీసులు ఆరా తీశారు. అయితే బస్సు బ్రేక్ ఫెయిల్ అయినందున ఈ ప్రమాదం జరిగిందని ఆర్టీసీ బస్సు డ్రైవర్ తెలిపాడు. ప్రమాదం జరిగిన విజువల్స్ స్థానిక సీసీ కెమెరాల్లో చిక్కాయి. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.