Gold Seized At Shamshabad Airport : శంషాబాద్ విమానాశ్రయంలో రూ.67.96 లక్షల బంగారం సీజ్ - శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బంగారం స్వాధీనం
🎬 Watch Now: Feature Video
Gold Seized At Shamshabad Airport : అక్రమార్కులు అనేక మార్గాల్లో బంగారాన్ని దేశంలోకి తీసుకువస్తూ ఉండడం పరిపాటిగా మారిపోయింది. ఈ అక్రమ బంగారం స్మగ్లింగ్‌కు కేరాఫ్ అడ్రస్‌గా హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయం మారిపోయిందేమోనన్న సందేహం.. పట్టుబడుతున్న గోల్డ్‌ను చూస్తేనే అర్థమవుతోంది. తాజాగా ఇదే శంషాబాద్ ఎయిర్‌పోర్టులోనే కిలోకు పైగా అక్రమంగా తరలిస్తున్న పసిడిని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రియాద్ నుంచి హైదరాబాద్ వచ్చిన ప్రయాణికుడిపై అనుమానం వచ్చి లగేజి చేకింగ్ చేయగా.. అందులో ఎమర్జెన్సీ లైట్ లోపల బ్యాటరీ స్థానంలో కడ్డీల రూపంలో బంగారాన్ని దాచినట్లు కస్టమ్స్ అధికారులు గుర్తించారు. 14 గోల్డ్ కడ్డీలను స్వాధీనం చేసుకున్న అధికారులు.. ఆ ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్నారు. ఆ మొత్తం 1287.6 గ్రాముల బంగారం ఖరీదు రూ. 67.96 లక్షలుగా అధికారులు తెలిపారు. అక్రమంగా బంగారం తరలిస్తున్న ప్రయాణికుడిపై కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నట్లు కస్టమ్స్ అధికారులు వివరించారు. హైదరాబాద్‌లో ఎవరికి ఆ బంగారాన్ని అందజేసేందుకు తెచ్చారనే కోణంలో ఆరా తీస్తున్నట్లు వారు వెల్లడించారు.