రైలు ఎక్కుతూ జారిపడ్డ మహిళ లక్కీగా RPF సిబ్బంది స్పందించి - కళబురగి రైల్వేస్టేషన్‌ లేటెస్ట్​ న్యూస్

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jan 2, 2023, 10:41 PM IST

Updated : Feb 3, 2023, 8:38 PM IST

కదులుతున్న రైలులో ఎక్కేందుకు యత్నించి కిందపడిపోయిన ఘటన కర్ణాటకలోని కళబురగి రైల్వేస్టేషన్‌లో జరిగింది. వెంటనే అప్రమత్తమైన అక్కడి ఆర్పీఎఫ్‌ సిబ్బంది మహిళను రక్షించారు. దీంతో అక్కడున్న అందరూ ఊపిరి పీల్చుకున్నారు. రైలు కదులుతున్న సమయంలో ఆ మహిళ రైలును ఎక్కేందుకు యత్నించింది. కాలు జారి ప్లాట్‌ఫాం, రైలుకు మధ్యగల సందులో పడిపోయింది. అక్కడే ఉన్న ఆర్పీఎఫ్‌ సిబ్బంది వెంటనే స్పందించి రైలును ఆపేందుకు సూచనలు చేశారు. అనంతరం ఆ మహిళను సురక్షితంగా బయటకు తీశారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డు అయ్యాయి.
Last Updated : Feb 3, 2023, 8:38 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.