రైలు కింద జారిపడిన ప్రయాణికుడు.. లక్కీగా... - ఒడిశా బర్హంపుర్ రైల్వే స్టేషన్ ఘటన
🎬 Watch Now: Feature Video
వేగంగా వెళ్తున్న రైలు నుంచి దిగేందుకు ప్రయత్నించి అదుపు తప్పి కింద పడిపోయాడు ఓ ప్రయాణికుడు. అక్కడే ఉన్న ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ చాకచక్యంగా వ్యవహరించి ప్రయాణికుడిని కాపాడాడు. ఈ ఘటన ఒడిశాలోని బ్రహ్మపుర రైల్వే స్టేషన్లో జరిగింది. రైల్వే స్టేషన్లోని సీసీటీవీ కెమెరాల్లో ప్రమాద దృశ్యాలు రికార్డయ్యాయి. ఆదివారం మధ్యాహ్నం జరిగిందీ ప్రమాదం.
అసోంకు చెందిన జయేశ్(34) అనే యువకుడు వేగంగా వెళ్తున్న ప్యాసింజర్ రైలులో నుంచి దిగేందుకు ప్రయత్నించాడు. అప్పుడు అదుపు తప్పి కింద పడిపోయాడు. రైలు కిందకు జారిపోతున్న జయేశ్ను అక్కడే ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ సూర్యకాంత్ సాహు రక్షించాడు. జయేశ్.. బ్రహ్మపురలో ప్యాసింజర్ రైలు దిగి చెన్నైకు మరో రైలులో వెళ్లేందుకు ఇలా చేశాడని రైల్వే పోలీసులు తెలిపారు.