ఒక్కసారిగా కుంగిన రోడ్డు.. గుంతలో పడ్డ వాహనాలు - road collapse in mumbai
🎬 Watch Now: Feature Video
Road Collapse : దేశంలోని రెండు ప్రధాన నగరాల్లో రోడ్లు కుంగిపోవడం వల్ల ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. అయితే రెండు చోట్ల ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఒక సంఘటన మహారాష్ట్ర ముంబయిలో జరగగా.. మరొకటి దేశ రాజధాని దిల్లీలో జరిగింది.
ఇదీ కథ..
ముంబయిలోని చునాభట్టి ప్రాంతంలో రోడ్డు కుంగిపోయి.. అక్కడ పార్కింగ్ చేసిన వాహనాలు గుంతలో పడిపోయాయి. రోడ్డు కుంగిపోవడం వల్ల ఆ ప్రాంతంలో పెద్ద గొయ్యి ఏర్పడింది. బుధవారం ఉదయం 9 గంటల సమయంలో చునాబట్టి కళాశాల దగ్గర్లో జరిగిన ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని మున్సిపల్ అధికారులు తెలిపారు. ముందు జాగ్రత్తగా ఆ మార్గాన్ని మూసివేశారు. అగ్నిమాపక సిబ్బంది, స్థానిక మున్సిపల్ సిబ్బంది సహాయ చర్యలు చేపట్టి.. గుంతలో పడిన వాహనాలను వెలికి తీశారు.
దిల్లీలో రోడ్డు కుంగిపోవడం స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది. నగరంలోని జనక్‌పురి, పోసంగిపుర్ రోడ్డు మార్గంలో మంగళవారం రాత్రి ఈ ఘటన జరిగింది. కాగా ఈ ప్రమాదంలో కూడా ఎలాంటి ప్రాణ నష్టం కలగనందున అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకొని.. బారికేడ్లతో రోడ్డును తాత్కాలికంగా మూసివేశారు.