Threats with Videos : 'నీ అశ్లీల వీడియోలు నా వద్ద ఉన్నాయి. డబ్బులు ఇవ్వకపోతే వాటిని ఇంటర్ నెట్‌లో పెడతా' అంటూ ఓ యువతిని బెదిరించి రూ.2.53 కోట్లు కాజేసిన నిందితుడిని నిడదవోలు పోలీసులు అరెస్టు చేశారు. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలుకు చెందిన ఓ యువతి హైదరాబాద్‌లో ప్రైవేటు హస్టల్లో ఉంటూ సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తోంది. అదే హాస్టల్‌లో తన చిన్ననాటి స్నేహితురాలు కాజా అనూష దేవి కలిసింది.
గొంతు మార్చి ఫోన్లో బెదిరింపులు : కాజా అనూష దేవి నినావత్ దేవనాయక్ అలియాస్ మధు సాయికుమార్‌ను తన భర్త అంటూ యువతికి పరిచయం చేసింది. దేవనాయక్ ప్రణాళిక ప్రకారం గొంతు మార్చి ఆ యువతికి ఫోన్ చేసి నీ నగ్న వీడియోలు నా వద్ద ఉన్నాయి. వాటిని ఆన్లైన్లో అప్‌లోడ్ చేయకుండా ఉండాలంటే డబ్బు ఇవ్వాలి అని డిమాండ్ చేశాడు. అనంతరం వేరొకరి సహాయంతో ఆ సమస్యను దేవనాయక్ పరిష్కరించినట్లు చెప్పి ఆ యువతి వద్ద డబ్బు తీసుకున్నాడు.
ఆస్తులను కొనుగోలు చేశాడు : ఇలా పలుదఫాలుగా నగదు తీసుకునే వ్యవహరం జరిగింది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేసే ఆ యువతి డబ్బులు ఇవ్వడానికి నిరాకరించడంతో దేవనాయక్ మళ్లీ బెదిరింపులకు దిగాడు. మొత్తంగా ఆమె నుంచి రూ.2.53 కోట్లకు పైగానే దేవనాయక్ కాజేసి వాటితో పలు రకాలైన స్థిర, చరాస్తులను కొనుగోలు చేశాడు. చివరకు బాధితురాలు నిడదవోలు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఈనెల 2న గుంటూరు జిల్లా చిన్నకాకానిలో దేవనాయక్‌ను అరెస్టు చేశారు. రూ.1.81 కోట్ల విలువైన స్థిర, చరాస్తులను సీజ్ చేశారు.
'న్యూడ్ వీడియోలతో బెదిరించి రెండేళ్లుగా బలవంతంగా నాపై అత్యాచారం' : పీఎస్‌లో మహిళ ఫిర్యాదు
వలపు వల విసురుతారు - చిక్కితే జేబు గుళ్ల చేస్తారు - ఇదొక కొత్త తరహా మోసం