Revanthreddy Speech in Lok Sabha : 'ప్రపంచంలోనే అత్యధిక అబద్ధాల పుస్తకం.. బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో' - Revanth Reddy criticizes Narendra Modi

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 9, 2023, 7:55 PM IST

Revanthreddy Speech in Lok Sabha : ప్రపంచంలోనే అత్యధిక అబద్ధాలు ఎక్కువగా ఉన్న పుస్తకం బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో అని.. లోక్​సభలో కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి విమర్శించారు. ఒకప్పుడు 10 మంది అగ్రనేతలు ఉన్న.. కమలం పార్టీలో ఇవాళ ఒకేఒక నాయకుడు ఉన్నారని అన్నారు. ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హమీ ఇచ్చిన కేంద్రం.. దానిని విస్మరించిందని దుయ్యబట్టారు. రైతుల ఆదాయంను రెట్టింపు చేస్తామని అన్నారని రేవంత్​రెడ్డి (Revanthreddy) గుర్తు చేశారు. 

నల్లధనం తీసుకొచ్చి ప్రతి పేదవాడి ఖాతాలో రూ.15 లక్షలు.. వేస్తామని చెప్పారని రేవంత్​రెడ్డి గుర్తు చేశారు. తొమ్మిదేళ్లలో కేంద్ర ప్రభుత్వం.. ప్రజలకు ఇచ్చిన ఏ హామీలు నేరవేర్చలేదని మండిపడ్డారు. అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా.. ప్రధాని నరేంద్ర మోదీ సభలోకి వచ్చి.. మణిపూర్​లో గిరిజనులపై జరుగుతున్న దాడులపై స్పందించి ఉంటే ఆయన గౌరవం పెరిగేదని అన్నారు. ఈ క్రమంలోనే కేంద్రం విభజించు పాలించు విధానాన్ని దేశంలో అమలు చేస్తుందని ధ్వజమెత్తారు. కర్ణాటకలో బీజేపీని తిరస్కరించారని.. ఇదే దేశానికి ఓ దిక్సూచి అని రేవంత్​రెడ్డి వ్యాఖ్యానించారు. 

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.