నీ వల్లే జైలుకు వెళ్లా - నీ చరిత్ర నాకు తెలీదా : రేవంత్ వర్సెస్ ఎర్రబెల్లి - రేవంత్ రెడ్డి కామెంట్స్ ఆన్ ఎర్రబెల్లి
🎬 Watch Now: Feature Video
Published : Nov 10, 2023, 12:33 PM IST
Revanth Vs Errabelli Word War : రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం(Election Campaign Telangana 2023)లో నాయకుల మధ్య మాటల యుద్దం నడుస్తోంది. విమర్శలు, ప్రతి విమర్శలతో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు.. మాటల యుద్ధానికి దిగారు. తాను జైలు కెళ్లడానికి ఎర్రబెల్లినే కారణమని రేవంత్ ఆరోపించగా.. తనకేం సంబంధం లేదని దయాకర్‌రావు స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వర్డ్ వార్ నడిచింది.
Errabelli Reaction on Revanth Reddy Comments : నమ్మించి మోసం చేయడంలో ఎర్రబెల్లి దయాకర్ రావును మించిన వారు లేరని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. పాలకుర్తిలో కాంగ్రెస్ విజయభేరి సభకు హాజరైన రేవంత్.. రేషన్ డీలర్‌గా జీవితం ప్రారంభించిన దయాకర్ రావుకు వందల ఎకరాల భూములు ఎలా వచ్చాయని.. అమెరికాలో పెట్టుబడులు ఎలా వచ్చాయో ప్రజలు ఆలోచించాలని సూచించారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు(Errabelli Fires on Revanth) తీవ్రంగా విరుచుకుపడ్డారు. రేవంత్ రెడ్డి.. జీవితం ఎలా మొదలైందో.. ఆయన చరిత్ర ఏంటో తనకు తెలీదా అంటూ మంత్రి ఎర్రబెల్లి విమర్శించారు. ఎంత మందిని బ్లాక్ మెయిల్ చేసి.. ఎంత సంపాదించావో అందరికీ తెలుసని మంత్రి ఆరోపించారు.