'కేసీఆర్ కుటుంబానికి ఉద్యోగాలు ఉన్నంత వరకు యువతకు ఉద్యోగాలు రావు' - రేవంత్ రెడ్డి రోడ్‌షో
🎬 Watch Now: Feature Video
Published : Nov 14, 2023, 7:58 PM IST
Revanth Reddy Vijayabheri Sabha in Kamareddy : కేసీఆర్ కుటుంబానికి ఉద్యోగాలు ఉన్నంత వరకు.. యువతకు ఉద్యోగాలు రావని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్.. ముఖ్యమంత్రి ఉద్యోగం ఊడగొడితేనే మన పిల్లలకు సర్కారు కొలువులు వస్తాయని రేవంత్ పలికారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తాను స్వయంగా పోటీ చేస్తోన్న మరొక నియోజకవర్గం కామారెడ్డిలో ఇవాళ ప్రచారాన్ని హోరెత్తించారు. బీఆర్ఎస్ సర్కార్ వైఫల్యాలను ఎండగడుతూ.. ఆరు గ్యారెంటీలను ప్రజలకు వివరించారు. గజ్వేల్‌లో కబ్జా చేయడానికి భూములు మిగల్లేదనే కేసీఆర్ కన్ను కామారెడ్డిపై పడిందని ఆరోపించారు.
మీ భూములను దోచుకునేందుకు ఎమ్మెల్యే రూపంలో మారువేశంలో కేసీఆర్ ఇక్కడికి వస్తున్నారని.. ఈ ప్రాంత భూములను దోచుకునేందుకు వచ్చిన గజదొంగను పడగొట్టేందుకే తాను కామారెడ్డి వచ్చానని రేవంత్ రెడ్డి పలికారు. కామారెడ్డి ప్రజలకు అండగా ఉండేందుకే పోటీ చేస్తున్నానని వివరించారు. కేసీఆర్ నుంచి కామారెడ్డిని కాపాడే బాధ్యత తనదన్నారు. కాంగ్రెస్‌ను గెలిపిస్తే ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ వస్తే విద్యుత్ ఉండదని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారని.. అసలు ఉచిత విద్యుత్ దస్త్రంపై తొలి సంతకం పెట్టింది నాటి మంత్రి షబ్బీర్ అలీ అని స్పష్టం చేశారు.