ఓటుకు 10 వేలు ఇచ్చి గెలవాలని కేసీఆర్ చూస్తున్నారు : రేవంత్ రెడ్డి - రేవంత్ రెడ్డి కామెంట్స్ ఆన్ కేసీఆర్
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/18-11-2023/640-480-20058133-thumbnail-16x9-revanth-reddy.jpg)
![ETV Bharat Telangana Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telangana-1716536068.jpeg)
Published : Nov 18, 2023, 11:02 PM IST
Revanth Reddy Election Campaign in Kamareddy : గల్ఫ్ కార్మికులు, బీడీ కార్మికుల బతుకులు మారాలంటే రాష్ట్రంలో కాంగ్రెస్(Congress) పార్టీ అధికారంలోకి రావాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా రాజంపేట, భిక్కనూరులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రేవంత్‌రెడ్డి.. అధికార బీఆర్ఎస్పై తీవ్రంగా విరుచుకుపడ్డారు. కేసీఆర్ నుంచి కామారెడ్డి రైతుల భూములను కాపాడేందుకే.. ఇక్కడి నుంచి పోటీచేస్తున్నానని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
Congress election Campaign Today : రైతులు కల్లాలలో రోజుల తరబడి పడిగాపులు ఉన్నారని.. కొందరు రైతులు గుండెపోటుతో ధాన్యం కుప్పల పైనే ప్రాణం విడిచారని రేవంత్(Revanth Reddy) విచారం వ్యక్తం చేశారు. వడగళ్ల వానలు పడి పంట నష్టం జరిగితే కేసీఆర్ వచ్చి చూడలేదని.. రూ.10 వేలు నష్టపరిహారం ప్రకటించి కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ విడిచిపెట్టి కామారెడ్డికి ఎందుకు వచ్చారని ప్రశ్నించారు. ఎంపీ, ఎమ్మెల్యే, సీఎంగా ఇన్నేళ్లలో కోనాపూర్‌కు ఎందుకు రాలేదని నిలదీశారు.
Revanth Reddy Comments on KCR : కామారెడ్డి భవిష్యత్‌ను మార్చే ఎన్నికలని రేవంత్‌రెడ్డి అన్నారు. రైతుల భూములను మింగేందుకే కేసీఆర్ కామారెడ్డి(Kamareddy)కి వచ్చారని తెలిపారు. ఓటుకు రూ.10 వేలు ఇచ్చి గెలవాలని కేసీఆర్ చూస్తున్నారని ఆరోపించారు. రూ.200 కోట్లు ఖర్చు పెట్టి.. రూ.2 వేల కోట్ల భూములు లాక్కుంటారని పేర్కొన్నారు. రైతుల భూములు కాపాడేందుకే కామారెడ్డిలో పోటీ చెస్తున్నానని స్పష్టం చేశారు. మన భూములు మనకే ఉండాలంటే కేసీఆర్‌ను ఓడించాలని అన్నారు.