ధరణి సమస్యలపై సీఎం రేవంత్‌కు మాజీ ఎమ్మార్వో ఫిర్యాదు - సీఎం రేవంత్‌కి ధరణి సమస్యలపై ఫిర్యాదు
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/08-12-2023/640-480-20219042-thumbnail-16x9-dharaniportal-complaint-to-cmrevanth-reddy.jpg)
![ETV Bharat Telangana Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telangana-1716536068.jpeg)
Published : Dec 8, 2023, 7:01 PM IST
Retired MRO On Dharani Portal : ధరణి సమస్యలతో రైతులు సతమతమవుతున్నారని వాటి పరిష్కారానికి త్వరితగతిన నూతన ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మార్వో రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రంగారెడ్డి జిల్లాలో పని చేసిన మాజీ తహసిల్దార్ ప్రేమేందర్ రెడ్డి రైతు సమస్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వినతి పత్రం ఇచ్చారు. ధరణి కంటే ముందున్న సమస్యలు కూడా ఇంతలా ఇబ్బంది పెట్టలేదని ఆయన స్పస్టం చేశారు.
ధరణి పోర్టల్ ద్వారా భూముల సర్వే నంబర్ల వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ధరణిలో అమలులో ఉన్న చట్టాలు 1950 ముందు ఉన్నాయని వాటిలో చాలా లొసుగులు ఉన్నాయని చెప్పారు. ఇప్పుడు సమస్యలు రోజురోజుకు పెరుగున్నాయని దీనంతటికి కారణం సీఎం కేసీఆర్ అని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారన్నారు. ముఖ్యమంత్రి ప్రత్యేకంగా దృష్టి సారిస్తే ధరణఇ సమస్యలు తొలగిపోతాయని ప్రజాదర్బార్‌పై వినతిపత్రం ఇచ్చేందుకు వచ్చిన మాజీ ఎమ్మెర్వో ప్రేమేందర్‌రెడ్డితో మా ఈటీవీ ప్రతినిధి తిరుపాల్ రెడ్డి ముఖాముఖి