Retired ISRO Scientist on Chandrayaan 3 Launch : ''చంద్రయాన్-3' ప్రయోగం భారత్‌కు చాలా కీలకం'' - చంద్రయాన్
🎬 Watch Now: Feature Video
ISRO Retired Scientist Ramakrishna Interview : ప్రపంచం మొత్తం ఎంతో ఆసక్తితో శ్రీహరికోటవైపు చూస్తోంది. ఇస్రో చంద్రయాన్-3 ప్రయోగానికి కౌంట్ డౌన్ ప్రారంభం అవుతోంది. ప్రతిష్ఠాత్మకమైన ఈ ప్రయోగానికి సర్వం సిద్ధమైంది. చంద్రయాన్-3 లాంచ్ రిహార్సల్‌ను బుధవారం పూర్తి చేసినట్లు సమాచారం. ఇవాళ మధ్యాహ్నం ఈ రాకెట్ లాంచింగ్‌కు ముహూర్తం ఖాయం చేశారు. మధ్యాహ్నం 2.35 గంటలకు శ్రీహరికోట నుంచి నింగిలోకి చంద్రయాన్-3 దూసుకెళ్లనుంది. భూమికి సుమారు 3.84 లక్షల కిమీ దూరంలో ఉన్న చంద్రుడి వరకు మూడు స్టేజుల్లో ఈ ప్రయోగం కొనసాగనుంది. మరి ఇప్పటికే ఈ ప్రతిష్ఠాత్మకమైన ప్రయోగాన్ని ప్రజలు వీక్షించేందుకు వీలుగా షార్‌లో ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు. మరి భారతదేశం ఇంత ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న చంద్రయాన్-3 ప్రయోగం భారత్‌కు, ఇస్రోకు ఎంతవరకు కీలకం కానుంది. చంద్రయాన్-2 విఫలం నుంచి ఇస్రో నేర్చుకున్న కీలక పాఠాలేంటి..? మరోసారి విఫలం కాకుండా చేస్తున్న ప్రయత్నాలు ఏంటి..? భారత్ ఇప్పటికే అంతరిక్ష రంగంలో దూసుకెళ్తున్న సందర్భంలో రానున్న రోజుల్లో స్పేస్ రంగం కీలకమైన సమయంలో మనం అగ్రగామిగా నిలబడటానికి ఎలాంటి అవకాశాలు ముందున్నాయి.. అన్న అంశంపై ఇస్రో రిటైర్డ్ సీనియర్ సైంటిస్ట్ రామకృష్ణతో ఈటీవీ భారత్ ముఖాముఖి.