శ్వేతవర్ణంలో కనువిందు చేసిన అరుదైన సర్పం, ఎక్కడంటే
🎬 Watch Now: Feature Video
కర్ణాటక జిల్లా కుమాటా తాలుకలోని రామ్‌నగర్‌కు చెందిన సుబ్రహ్మణ్య నాయక ఇంట్లో ఒక వింత కొండచిలువ దర్శనమిచ్చింది. శ్వేతవర్ణంలో మెరిసిపోతూ ఓ సర్పం కనువిందు చేసింది. దీంతో ఆ పామును చూసేందుకు స్థానికులు అతని ఇంటి వద్ద గుమికూడారు. స్థానికుల సమాచారంతో అక్కడికి వచ్చిన రెప్టైల్ స్పెషలిస్ట్ ఆ పామును పరిశీలించారు. దాన్ని వైట్ ఫైథాన్గా గుర్తించారు. ఇది వేరే జాతి కొండచిలువ కాదని పాము శరీరంలో రంగును ఉత్పత్తి చేసే మెలనిన్ అనే పిగ్మెంట్ లోపం కారణంగా కొండచిలువకు ఆ రంగు వచ్చిందని ఆయన తెలిపారు. తర్వాత కొండచిలువను సురక్షిత ప్రాంతంలో వదిలేశారు.
Last Updated : Feb 3, 2023, 8:27 PM IST