ఇంట్లోనే సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు గుడికట్టిన అభిమాని, దైవంగా భావించి పూజలు - జైలర్ మూవీ కలెక్షన్లు
🎬 Watch Now: Feature Video
Published : Nov 1, 2023, 5:32 PM IST
Rajinikanth Temple In Tamilnadu : సూపర్‌స్టార్ రజనీకాంత్‌పై ఉన్న అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నాడు ఓ అభిమాని. ఇంట్లోనే తలైవా రజనీకాంత్ విగ్రహాన్ని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు చేస్తున్నాడు తమిళనాడులోని మధురైకు చెందిన కార్తీక్. తలైవా రజనీ అంటే తనకు చాలా ఇష్టమని చెబుతున్నాడు కార్తీక్.
'రజనీకాంత్ విగ్రహం బరువు 250 కిలోలు. నాకు సూపర్‌స్టార్ రజనీ దేవుడితో సమానం. ఆయనపై గౌరవం, ప్రేమతో నా ఇంట్లోనే గుడి కట్టాను. నా కూతురు అనసూయ కూడా రజనీ అభిమానే. గుడిలో దేవుడిని ఎలా పూజిస్తామో అదే విధంగా రజనీకాంత్ విగ్రహాన్ని కూడా నేను, నా కూతురు పూజిస్తాం'అని కార్తీక్ చెప్పారు.
సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రపంచవ్యాప్తంగా భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నారు. తమిళ ఫ్యాన్స్ ఆయనను ముద్దుగా తలైవా అని పిలుచుకుంటారు. రజనీ ఆరు పదుల వయసు దాటినా తనదైన స్టైల్‌తో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇటీవల రజనీకాంత్ నటించిన జైలర్ సినిమా విడుదలై.. ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్లు సాధించింది.