Rain Storm in Mancherial : గాలివాన బీభత్సం.. ఎగిరిపోయిన ఇళ్ల పైకప్పులు - మంచిర్యాల జిల్లాలో గాలివాన బీభత్సం
🎬 Watch Now: Feature Video
Strong Winds Created Havoc In Mancherial District : మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలంలో శనివారం రాత్రి ఈదురుగాలులతో కూడిన గాలివాన బీభత్సం సృష్టించింది. గాలివాన ధాటికి పలు ప్రాంతాల్లో ఇళ్ల పై కప్పులు ఎగిరిపోయి.. ప్రజలు తల్లడిల్లి పోయారు. మండలంలోని ఐతపల్లి, సూర్జపూర్, మాడవెల్లి గ్రామాల్లో ఇళ్లపై ఉన్న రేకులు ఎగిరిపోవడంతో పాటు ఇంటి గోడలు కూలిపోయాయి. ప్రధానంగా కొన్నిచోట్ల పెనుగాలులకు పదుల సంఖ్యలో పూరిళ్లు పడిపోయాయి.
ఇండ్ల పై కప్పులు ఎగిరిపోయి.. చెట్ల కొమ్మల్లో చిక్కుకున్నాయి. అవి ఎవరి మీద పడతాయోనని స్థానికులు భయంతో వణికిపోయారు. పదుల సంఖ్యలో విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. కొన్ని ప్రాంతాల్లో చెట్లు విరిగి ఇళ్లపై పడ్డాయి. రహదారిపై చెట్లు కూలి రోడ్డుకు అడ్డంగా పడిపోయాయి. దీంతో వాహన రాకపోకలకు తీవ్ర ఆటంకం కలిగింది. వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. గాలి వాన బీభత్సానికి జిల్లా ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు.