ఆటో ఎక్కిన రాహుల్ గాంధీ.. యూసఫ్​గూడలో అజారుద్దీన్​తో ఆటోలో చిట్​చాట్ - హైదరాబాద్​లో రాహుల్ గాంధీ ఎన్నికిల ప్రచారం

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telugu Team

Published : Nov 28, 2023, 3:08 PM IST

Updated : Nov 28, 2023, 8:30 PM IST

Rahul Gandhi Travelled in Auto in Hyderabad : తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ నేతలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారపర్వంలో ఇవాళ చివరి రోజున కాంగ్రెస్ అగ్రనేత రాహుల్​ గాంధీ హైదరాబాద్​లో ప్రచారం చేస్తున్నారు. హైదరాబాద్​లో అధిక శాతంలో పనులు చేస్తున్న ఆటో వర్కర్స్​ యూనియన్​తో పాటు, జీహెచ్ఎంసీ, గిగ్ వర్కర్స్​ యూనియన్లతో రాహుల్ గాంధీ సమావేశమయ్యారు. ప్రతి ఒక్కరితో మాట్లాడిన ఆయన వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.  

అనంతరం జూబ్లీహిల్స్​ నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న మాజీ క్రికెటర్ అజారుద్దీన్​తో కలిసి యూసఫ్​గూడలో ఆటోలో ప్రయాణించారు. రాహుల్ గాంధీ ఆటోలో కనిపించేసరికి ఆయన్ను చూడటానికి ప్రజలు పెద్దఎత్తున గుమిగూడారు. నగరంలో ఎన్నికల ప్రచారం, పార్టీ బలబలాలపై అజారుద్దీన్​తో ఆటోలో చర్చిస్తూ రాహుల్ గాంధీ కనిపించారు. మధ్యాహ్నం రాహుల్ గాంధీ.. సోదరి ప్రియాంక గాంధీ, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో కలిసి మల్కాజ్​గిరిలో రోడ్ ​షోలో పాల్గొంటారు. 

Last Updated : Nov 28, 2023, 8:30 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.