కాంగ్రెస్ అధికారంలోకి రాగానే- బీఆర్ఎస్ లాక్కొన్న సంపదను ప్రజలకే పంచుతాం : రాహుల్ గాంధీ - రాహుల్ గాంధీ కామెంట్స్
🎬 Watch Now: Feature Video
Published : Nov 26, 2023, 5:26 PM IST
Rahul Gandhi Election Campaign in Kamareddy : రాష్ట్రంలో ప్రశ్నపత్రాల లీకేజీలతో నిరుద్యోగుల ఉసురు తీస్తున్నారని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ అన్నారు. ధరణి పేరుతో సీఎం కేసీఆర్ వేల ఎకరాలు దోచుకున్నారని ఆరోపించారు. కామారెడ్డిలో కాంగ్రెస్ నిర్వహించిన బహిరంగ సభలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. తెలంగాణలో 8 లక్షల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని విచారం వ్యక్తం చేశారు. కాంగ్రెస్(Congress) ఏమి చేసిందని కేసీఆర్ అంటున్నారని... వారు ప్రయాణిస్తున్న రోడ్డు, చదువుకున్న పాఠశాల కాంగ్రెస్ హయంలో వేసిందేనని బదులు ఇచ్చారు.
Rahul Gandhi Election Campaign Today : కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కేసీఆర్ దోచుకున్న సొమ్మును తిరిగి ప్రజలకు చెందేలా చేస్తామని రాహుల్ గాంధీ (Rahul Gandhi) హామీ ఇచ్చారు. దీంతో పాటు ఆరు గ్యారంటీలకు చట్టబద్దత కల్పించి అమలు చేస్తామని అన్నారు. మహాలక్ష్మీ పథకం ద్వారా మహిళలకు ప్రతీ నెలా రూ.2500 అందిస్తామని.. రూ.500లకే వంట గ్యాస్ సిలిండర్ అందిస్తామని తెలిపారు. అధికారంలోకి రాగానే రైతులకు 24 గంటల ఉచిత కరెంటు అందిస్తామని.. రైతులకు, కౌలు రైతులకు ఏటా ఎకరానికి నగదు అందిస్తామని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను కాంగ్రెస్ నెరవేరుస్తుందని.. అధికారంలోకి కచ్చితంగా వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కామారెడ్డిలో రేవంత్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ప్రముఖ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు