Rahul Gandhi Bike Trip : 18 వేల అడుగుల ఎత్తైన రహదారిపై రాహుల్ బైక్ రైడింగ్.. వీడియో చూశారా? - చైనా ఆక్రమణపై రాహుల్ గాంధీ వ్యాఖ్యలు
🎬 Watch Now: Feature Video
Rahul Gandhi Bike Trip : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లద్ధాఖ్ పర్యటనలో ఉన్నారు. ఆయన లేహ్ జిల్లాలోని అందమైన ప్రదేశాలను సందర్శిస్తున్నారు. ఈ క్రమంలో ఖర్దూంగా లా పర్వత ప్రాంతాన్ని బైక్ నడుపుకుంటూ వెళ్లి రాహుల్ సోమవారం సందర్శించారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఉన్న రహదారిగా ఖర్దూంగా లా కనుమ పేరు పొందింది. ఈ పర్వత ప్రాంతం సముద్ర మట్టానికి 17,582 అడుగుల ఎత్తులో ఉంది. ఈ ఫొటోలను చూసిన నెటిజన్లు రాహుల్ మంచి స్టైలిష్ లుక్‌లో ఉన్నారని ప్రశంసిస్తున్నారు. అలాగే మరికొందరు నెటిజన్లు రాహుల్ స్మార్ట్ అని, రేసర్‌లా ఉన్నారంటూ కితాబిస్తున్నారు.
Rahul Gandhi Bike Ladakh : గత గురువారం(ఆగస్టు 17న) రాహుల్.. లేహ్ పర్యటనకు వచ్చారు. తొలుత రెండు రోజుల పాటే ఇక్కడ ఉండాలని భావించినా.. ఆగస్టు 25 వరకు తన పర్యటనను పొడిగించుకున్నారు. 2019లో ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత లద్ధాఖ్‌లో రాహుల్ పర్యటించడం ఇదే తొలిసారి. అగస్టు 20వ తేదీ తన తండ్రి ( రాజీవ్ గాంధీ) జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి లద్ధాఖ్లోని ప్యాంగాంగ్ సరస్సు వద్ద రాహుల్ నివాళులర్పించారు. ఈ క్రమంలో భారత భూభాగాన్ని చైనా ఆక్రమిస్తోందని ఆరోపించారు. ప్రధాని మోదీ మాత్రం చైనా ఆక్రమణపై మాట్లాడరని విమర్శించారు.