Rachakonda CP DS Chauhan on Ganesh Immersion : 'గణేశ్‌ నిమజ్జనానికి భారీ బందోబస్తు ఏర్పాటు.. శోభయాత్రకు సర్వం సిద్ధం' - గణేశ్‌ నిమజ్జనంపై రాచకొండ సీపీ చౌహాన్‌ వ్యాఖ్యలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Sep 26, 2023, 10:32 PM IST

Rachakonda CP DS Chauhan on Ganesh Immersion : రాచకొండ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో గణేశ్‌ నిమజ్జనం(Ganesh Idol immersion) కోసం భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని పోలీస్ కమిషనర్ డీఎస్ చౌహాన్(DS Chauhan) వెల్లడించారు. కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న డీసీపీలు, ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్‌లు, ఇతర అధికారులతో నాచారంలోని ఐఐసీటీ(IICT)లో సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు. గణేశ్‌  నిమజ్జనం సందర్భంగా శోభయాత్ర మార్గాలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలను వారికి వివరించారు. గణేశ్‌ నిమజ్జనం ప్రణాళిక ప్రకారం జరగాలని, ఎక్కడ ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. 

Ganesh Idol Immersion at Hyderabad : గణేశ్‌ విగ్రహాల నిమజ్జనం విషయంలో నిర్వాహకులతో, ఇన్‌స్పెక్టర్లు సమన్వయం చేసుకోవాలని సీపీ సూచించారు. నిమజ్జనం సమయంలో ఎక్కడా శాంతిభద్రతల సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. శాంతిభద్రతల విషయంలో అందరూ అధికారులు సమష్టిగా పనిచేయాలని కోరారు. నిమజ్జనం ఎక్కువగా సాగే చెరువులు, కుంటల మార్గాల్లో ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చూడాలన్నారు. రాచకొండ పోలీస్ అధికారులు, జీహెచ్‌ఎంసీ, అగ్నిమాపక శాఖ, నీటి పారుదల శాఖ, విద్యుత్, రవాణా శాఖ తదితర శాఖల అధికారులతో కలిసి సమన్వయం చేసుకుంటూ గణేశ్‌ నిమజ్జనం శాంతియుతంగా సజావుగా సాగేలా చూడాలని తెలిపారు.  

సీసీ కెమెరాల ద్వారా నిమజ్జనం సాగే మార్గాల ట్రాఫిక్‌ను, నిమజ్జనం జరిగే చోట పరిస్థితులను ప్రతిక్షణం గమనిస్తూ ఉండాలని సీపీ డీఎస్‌ చౌహాన్‌ అన్నారు. విజిబుల్ పోలీసింగ్‌కు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఎలాంటి సమస్యలు, ఘర్షణలు లేకుండా చర్యలు చేపట్టాలని, సమస్యాత్మక ప్రాంతాలు, మార్గాల్లో బందోబస్తును పెంచాలని సూచించారు. అవసరమైన ప్రదేశాల్లో ప్రత్యేక పికెట్ ఏర్పాటు చేయాలన్నారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో నిమజ్జనం జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశాలు జారీ చేశారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.