వర్షాకాలంలో ముంపు ప్రాంతాల ప్రజలకు కంటిమీద కునుకు ఉండదు : కె.హన్మంతరెడ్డి - హనుమంత రెడ్డి తాజా వార్తలు
🎬 Watch Now: Feature Video
Published : Nov 23, 2023, 5:38 PM IST
Qudbullapur Congress candidate Hanumanta Reddy Interview : హైదరాబాద్లోని కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో పదేళ్లుగా సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదని కాంగ్రెస్ అభ్యర్థి కె.హన్మంతరెడ్డి పేర్కొన్నారు. ఈ నియోజకవర్గం అన్ని ప్రాంతాల వారు ఉన్నారని తెలిపారు. బండారి లేఅవుట్లు, బాలాజీ ఎన్క్లేవ్ ప్రాంతాలు ముంపునకు గురి అవుతున్నాయన్నారు. గత పాలకులు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయలేదని విమర్శించారు. డ్రైనేజీ సమస్యతో స్థానిక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. తెలంగాణ వస్తే అన్ని రకాల సమస్యలు పరిష్కారం అవుతాయని ప్రజలు అనుకున్నారని, కానీ ఏ మాత్రం అభివృద్ధికి నోచుకోలేదని మండిపడ్డారు.
Congress Election Campaign 2023 : ప్రజల ప్రాణాలు పోతున్నా.. ఈ ప్రభుత్వం నిరంకుశ వైఖరిని అవలంభిస్తోందని విమర్శించారు. సీఎం, ఎమ్మెల్యేలు ప్రజలకు అందుబాటులో ఉండటం లేదని ఆరోపించారు. వర్షాకాలంలో ముంపు ప్రాంతాల ప్రజలకు కంటిమీద కునుకు కూడా ఉండదని ఆందోళన వ్యక్తంచేశారు. రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయని.. ఎవ్వరూ పట్టించుకోవడంలేదన్నారు. అందుకే మార్పు రావాలి.. కాంగ్రెస్ రావాలి అంటున్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి కె.హన్మంతరెడ్డితో ముఖాముఖి.