Puvvada Ajay Kumar Drive the RTC Bus Viral Video : స్వయంగా బస్సు నడిపి.. సందడి చేసిన పువ్వాడ - puvvada inaugurates new tsrtc bus depot yellandu

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Aug 28, 2023, 10:44 PM IST

Puvvada Ajay Kumar Drive the RTC Bus in Yellandu Viral Video : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో.. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్ (Puvvada Ajay Kumar ) పాల్గొన్నారు. ఈ సందర్భంగా రూ.3.75 కోట్లతో నూతనంగా ఏర్పాటు చేసిన బస్సు డిపోను ప్రారంభించిన పువ్వాడ.. స్వయంగా బస్సు నడిపి అక్కడి వారిని ఉత్సాహపరిచారు. అనంతరం ఇల్లందు ఖమ్మం రహదారిలో.. లలితాపురం వరకు రూ.10 కోట్లతో ఏర్పాటు చేయనున్న లైటింగ్ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ క్రమంలోనే వీధి వ్యాపారుల కోసం నిర్మించిన కాంప్లెక్స్‌ను పువ్వాడ అజయ్‌ కుమార్ ప్రారంభించారు. 

ఇల్లందు మున్సిపల్ ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం బస్సు డిపోను ఏర్పాటు  చేశామని పువ్వాడ అజయ్ కుమార్‌ తెలిపారు. ఖమ్మంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమావేశంలో.. కాంగ్రెస్‌ బీఆర్ఎస్ ఒకటేని అన్న వ్యాఖ్యలను ఆయన ఖండించారు. తాము 2జీ, 3జీ కాదని.. ప్రజల టీం అని స్పష్టం చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 సీట్లలో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని.. లేకపోతే అభివృద్ధి కుంటుపడుతుందని పువ్వాడ అజయ్‌ కుమార్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ, మహబూబాబాద్ ఎంపీ కవిత, ప్రజా ప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.