ఓటు వేయకుంటే బతికి ఉన్నా లేనట్లే, వచ్చేస్తున్నాం, ఓటేస్తామంటున్న ప్రజానికం - Bus stands Rush in Telangana
🎬 Watch Now: Feature Video
Published : Nov 29, 2023, 6:58 PM IST
Public Opinion on Voting Participation : ఓటు విలువ ఏమిటో అది వేసిన వారికే తెలుస్తుంది. ఉద్యోగాల రీత్యా.. ఇతర ప్రాంతాల్లో ఉన్న వారు దూరాభారం అని తెలిసినా లెక్కచేయక.. ఓటు వేయడానికి సొంతూళ్లకు వచ్చేస్తారు. ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి వరంగల్‌కు.. అక్కడ నుంచి గ్రామీణ ప్రాంతాలకు ఓటు వేయడానికి చాలామంది వెళ్తుండటంతో ప్రయాణ ప్రాంగణాలు రద్దీగా మారాయి. బస్సుల కోసం గంటల సేపు పడిగాపులు పడుతున్నారు. అందులోనూ తొలిసారి ఓటు వేయనున్న యువతైతే నూతన ఉత్తేజంతో ఓటు వేసేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నామని వివరించారు.
Bus stands Rush in Telangana : తమ మొదటి ఓటు వినియోగం.. భవిష్యత్ నాయకుడిను ఎన్నుకోవటంపై తమదైన పాత్ర వహిస్తున్నట్లు కొందరు ఆలోచనలు పంచుకున్నారు. మరికొందరైతే ఎంత ప్రయాసపడైనా.. అయిదేళ్లకొచ్చే ఓట్ల పండుగలో తప్పనిసరిగా పాల్గొనాలంటూ బదులిచ్చారు. ఎన్ని కష్టాలు పడినా ఓటు వేస్తామని.. ఓటు వేయకుంటే.. బతికి ఉన్నా లేనట్లే అంటున్న ఓటర్లతో మా ప్రతినిధి ముఖాముఖి.