పానీపూరీ అమ్ముకుంటున్న డాక్టర్​.. ఆస్పత్రికి తాళం వేసి మరీ వ్యాపారం.. ఎందుకంటే.. - పానీపూరి అమ్ముతున్న డాక్టర్​

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Mar 26, 2023, 7:09 PM IST

రాజస్థాన్​కు చెందిన ఓ డాక్టర్​.. పానీపూరీ వ్యాపారిగా మారిపోయారు. రోగులను పరీక్షిస్తూ.. మందులను ఇవ్వాల్సిన ఆమె.. రోడ్డుపై పానీపూరీ అమ్ముతున్నారు. ఆస్పత్రికి తాళం వేసి మరీ.. దాని ఎదుటే విక్రయిస్తున్నారు. ఆమె ఇలా చేయడం వెనుక పెద్ద కారణమే ఉంది.
రాజస్థాన్​లోని అశోక్​ గహ్లోత్ ప్రభుత్వం ఇటీవలే తీసుకువచ్చిన ఆరోగ్య బిల్లుకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా వైద్యులు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలోనే సీకార్​కు చెందిన డాక్టర్​ అనిత అనే వైద్యురాలు.. వినూత్నంగా నిరసన చేపట్టారు. దీక్షలు, ఆందోళనలు చేయకుండా.. తన ఆస్పత్రికి తాళం వేసి.. అక్కడే పానీపూరీ అమ్ముతున్నారు. ఆస్పత్రి బోర్డు తీసేసి 'అనిత పుచ్కావాలీ' అని పానీపూరి దుకాణం బోర్డు పెట్టారు. తన నేమ్ ​బోర్డ్​ను సైతం 'అనిత పుచ్కావాలీ, మాజీ ప్రైవేట్ డాక్టర్​' అని మార్చుకున్నారు. 
మరో వైద్యుడు కూడా తన ఆస్పత్రిని పరోఠా సెంటర్​గా మార్చారని తెలిపారు డాక్టర్ అనిత. ప్రైవేట్​ ఆస్పత్రులు ఆందోళన నడుమే 'రైట్​ టూ హెల్త్' బిల్​ను ఆమోదించింది రాజస్థాన్ ప్రభుత్వం. దీని వల్ల రాష్ట్రంలోని ప్రతి పౌరుడు ఎలాంటి ఛార్జీలు లేకుండా ఏ ఆస్పత్రిలోనైనా అత్యవసర చికిత్స పొందవచ్చు. కానీ ఈ బిల్లును రాష్ట్రంలోని ప్రైవేట్ ఆస్పత్రులు గట్టిగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ చట్టం పేరుతో రాజస్థాన్ ప్రభుత్వం ప్రైవేటు ఆస్పత్రుల వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటుందని ఆరోపిస్తున్నాయి. తక్షణమే 'రైట్​ టూ హెల్త్' చట్టాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు ఆస్పత్రుల వైద్యులు నిరసనలు చేపడుతున్నారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.