బంజారా మహిళలతో ప్రియాంకా గాంధీ స్టెప్పులు - తెలంగాణలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం
🎬 Watch Now: Feature Video
Published : Nov 25, 2023, 7:43 PM IST
Priyanka Gandhi Dance with Banjara Women Viral Video : రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతుంది. ఇక ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకా గాంధీ.. జోష్తో ముందుకు వెళ్తున్నారు. ఒకపక్క ఎన్నికల ప్రచారంలో ప్రధాన పార్టీలను టార్గెట్ చేస్తూనే.. మరోవైపు అమె ప్రజలతో మమేకం అవుతున్నారు. శనివారం మధిరలో రోడ్ షోలో పాల్గొన్న ప్రియాంకా.. గిరిజనులతో కలిసి డ్యాన్స్ చేస్తూ కార్యకర్తల్లో జోష్ నింపారు.
ఇక తాజాగా నిన్నటికి నిన్న ఒక సామాన్య మహిళ ఇంటికి వెళ్లి నువ్వు నా స్నేహితురాలివి అని పేర్కొని ఆశ్చర్యానికి గురిచేశారు. ఎన్నికల సభకు వచ్చిన మహిళలతో ఎంతో ఆప్యాయంగా మాట్లాడారు. అంతేకాకుండా రోడ్డు మార్గంలో సభకు వచ్చి వాహనాల్లో వెళ్తున్న వారితో కరచాలనం చేస్తూ.. సెల్ఫీలు దిగారు. ఇక తాజాగా రేవంత్ రెడ్డి పాటకు తండా మహిళలతో కలిసి ప్రచార రథంపైనే ప్రియాంకా గాంధీ స్టెప్పులు వేశారు. అదిప్పుడు నెట్టింట వైరల్గా మారి చక్కెర్లుకొడుతోంది.