Rajathkumar on Krishna River Water Allocation : 'జలాల కేటాయింపు న్యాయబద్ధంగా జరగాల్సిందే' - తెలంగాణ న్యూస్
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/640-480-18466570-830-18466570-1683701979396.jpg)
Rajathkumar on Krishna River Water Allocation : కృష్ణా నదీ జలాల కేటాయింపు న్యాయబద్ధంగా జరగాలని నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్‌కుమార్ తెలిపారు. కృష్ణా నదీ జలాల యాజమాన్య బోర్డు అధికారులు హైదరాబాద్‌లో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి మాట్లాడుతూ.. నీటి వాటా ఖరారు అంశాన్ని ట్రైబ్యునల్‌కు నివేదించాలని.. కేంద్రం తొమ్మిదేళ్లుగా ఈ అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అన్నారు. తాత్కాలిక సర్దుబాటు 66.34 శాతం రాష్ట్రానికి ఆమోదయోగ్యం కాదని ఆయన తెలిపారు.
811 టీఎంసీల్లో ఇరు రాష్ట్రాలకు చెరో సగం కేటాయించాలని కేంద్రాన్ని కోరారు. గత సంవత్సరం ఆంధ్రప్రదేశ్‌కు 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలు కేటాయించారని.. దీనికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించలేదని చెప్పారు. పాలమూరు-రంగారెడ్డిపై కేంద్రం సరిగా స్పందించలేదని అన్నారు. పట్టి సీమ, గోదావరి జలాల మళ్లింపులో రాష్ట్రానికి వాటా ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. అప్పర్ భద్రతకు జాతీయ హోదా కల్పించిన విషయాన్ని గుర్తు చేశారు. జూన్ 1 నుంచి జలాల కేటాయింపు గురించి కేంద్రం మాట్లాడనుందని చెప్పారు. ఈసారి మరో 105 టీఎంసీలు రాష్ట్రానికి కావాలని అడగనున్నట్లు తెలిపారు.