ఈ నెల 18కి హైదరాబాద్‌కు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, అధికారుల కాన్వాయ్ రిహార్సల్ - ద్రౌపది ముర్ము హైదరాబాద్‌లో పర్యటన
🎬 Watch Now: Feature Video
Published : Dec 16, 2023, 9:00 PM IST
President Draupadi Murmu Winter Session in Telangana : శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము హైదరాబాద్‌కు రానున్నారు. ఆమె పర్యటన నేపథ్యంలో అధికారులు కాన్వాయ్ రిహార్సల్ నిర్వహించారు. హకీంపేట్ విమానాశ్రయం నుంచి బొల్లారం రాష్ట్రపతి నిలయం చేరుకున్న తర్వాత సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ వరకు అధికారులు కాన్వాయ్ రిహార్సల్ చేశారు. ఈ నెల 18 నుంచి 23 వరకు రాష్ట్రపతి పర్యటించనున్నారని అధికారులు తెలిపారు.
President Murmu Visit Hyderabad : రాష్ట్రపతి ఐదు రోజల పాటు నగరంలో ఉండనున్న నేపథ్యంలో తగు జాగ్రత్తలను తీసుకున్నామని అధికారులు తెలియజేశారు. రాష్ట్రపతి ముర్ము ఈ నెల 23న మధ్యాహ్నం తిరిగి దిల్లీకి బయలుదేరనున్నట్లు వెల్లడించారు. మరోవైపు ఒమన్ సుల్తానేట్ రాష్ట్ర అధిపతి హిస్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్ భారతదేశ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఈరోజు ఆయనకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాన మంత్రి నరేంద్రమోదీ లాంఛనంగా రాష్ట్రపతి భవన్‌లో స్వాగతం పలికారు.