Jagtial Rains News : గర్భిణీ ప్రసవ వేదన.. జేసీబీ సాయంతో వాగు దాటింపు

By

Published : Jul 27, 2023, 5:15 PM IST

thumbnail

జగిత్యాల జిల్లాలోని అన్ని ప్రాంతాల రహదారులు ఎక్కడికక్కడ స్తంభించిపోయాయి. వరద ఉప్పొంగుతుండటంతో వంతెనల మీదుగా రాకపోకలు కష్టతరంగా మారాయి. ఈ క్రమంలోనే మేడిపల్లి మండలం రాజలింగంపేట గ్రామానికి చెందిన ఓ గర్భిణీకి పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో కుటుంబసభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే మార్గ మధ్యలో ఉన్న వాగు మీదుగా వరద నీరు పొంగి పొర్లుతుండటంతో.. ఆ వాగు దాటి ముందుకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. బాధిత కుటుంబసభ్యులు వెంటనే సర్పంచ్​కు సమాచారం అందించారు. గ్రామ సర్పంచ్ సకాలంలో స్పందించి.. జేసీబీ సాయంతో గర్భిణీని వాగు దాటించి ఆసుపత్రికి పంపించేలా చొరవ తీసుకున్నారు. వాగు అవతలి వైపు సిద్దంగా ఉన్న అంబులెన్స్‌లో గర్భిణీని కోరుట్ల హాస్పిటల్‌కు తరలించారు.

ఇదిలా ఉండగా.. గత 3 రోజులుగా రాష్ట్రంలో వానలు ఎడతెరపి లేకుండా దంచికొడుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రతి జిల్లాలో వర్షాలపై పర్యవేక్షిస్తున్నామని డీజీపీ అంజనీకుమార్ తెలిపారు. ప్రజలు అత్యవసర సమయాల్లో మాత్రమే బయటకు రావాలని ఆయన సూచించారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే 100కు సమాచారం అందించాలన్నారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.