గర్భిణీని భుజాలపై మోస్తూ 6కి.మీ నడక - గర్భిణీని భుజాలపై మోసుకెళ్లిన గ్రామస్థులు
🎬 Watch Now: Feature Video
గిరిజన గర్భిణీని భుజాలపై మోస్తూ 6 కిలోమీటర్లు నడిచారు గ్రామస్థులు. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలోని ధూలే జిల్లాలోని శిర్పూర్‌లో జరిగింది. గ్రామానికి సరైన రోడ్డు సౌకర్యం లేకపోవడం వల్ల కాలినడకన ఆస్పత్రికి తరలించారు.
ఇదీ జరిగింది
జిల్లాలోని తువాంపణి గ్రామానికి చెందిన గిరిజన గర్భిణీకి అకస్మాత్తుగా నొప్పులు మొదలయ్యాయి. వెంటనే అంబులెన్స్‌కు ఫోన్ చేయగా.. అది వచ్చేందుకు సరైన రోడ్డు మార్గం లేదు. దీంతో గ్రామస్థులే.. కర్రకు ఓ వస్త్రాన్ని కట్టి భుజాలపై మోసుకెళ్లారు. గ్రామానికి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుర్హాల్పణి వరకు భుజాలపై తీసుకెళ్లారు. అక్కడి నుంచి బైక్‌పై తరలించారు. నొప్పులు తీవ్రం కావడం వల్ల ఆపరేషన్ చేశారు వైద్యులు. ప్రస్తుతం తల్లి, శిశువు ఇద్దరు సురక్షితంగా ఉన్నారని చెప్పారు.
తమ గ్రామానికి సరైన రోడ్డు సౌకర్యం లేకపోవడం చాలా ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల జిల్లా పరిషత్ సీఈఓ గ్రామానికి రాగా.. గ్రామస్థులు ఆందోళన నిర్వహించారు. తమ గ్రామానికి రోడ్డు నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. ఇలా అనేక మంది అధికారులకు విన్నవించినా ప్రయోజనం లేదని వాపోయారు.