Prathidwani : ఎన్డీయే కూటమా? ఇండియా కూటమా? లోక్‌సభలో రాజుకున్న రాజకీయ వే'ఢీ'
🎬 Watch Now: Feature Video
Prathidwani : ఎన్డీయే ప్రభుత్వంపై విపక్ష కూటమి ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానంపై లోక్‌సభలో వాడీవేడిగా ప్రారంభమైంది చర్చ. జులై 20వ తేదీన ప్రారంభమైన పార్లమెంట్ సమావేశాలు.. ఇంకా జరుగుతున్నాయి. మణిపూర్ ఘర్షణలపై ప్రత్యేక చర్చలపై విపక్షాలు పట్టుపట్టాయి. చివరకు అవిశ్వాసం వరకు విపక్షాల కూటమి వెళ్లింది. తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇండియా కూటమి ప్రవేశపెట్టిన ఈ తీర్మానంపై చర్చలో భాగంగా ఈ నెల 10వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమాధానం ఇవ్వనున్నారు.
అయితే.. సంఖ్యాబలం పరంగా చూస్తే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే పూర్తి ఆధిక్యం కలిగి ఉంది. అది తెలిసి కూడా ప్రతిపక్షాలు అవిశ్వాసం తీర్మానం పెట్టడానికి కారణం ఏమిటి? అసలు విపక్షాలు ఈ చర్చ ద్వారా ఏం ఆశిస్తున్నాయి? మణిపుర్‌లో జాతుల వైరం అపరిష్కృతంగా ఎందుకుంది? మణిపూర్ మంటలను చల్లార్చి.. అక్కడ శాంతిస్థాపన దిశగా ఈ మొత్తం పరిణామాలు ఓ పరిష్కారం చూపిస్తాయని ఆశించవచ్చా? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.