Prathidwani on ward governance : బస్తీల్లోకే బల్దియా సేవలు - Ward governance
🎬 Watch Now: Feature Video
Ward governance in hyderabad : భాగ్యనగరంలో బల్దియా సేవల్ని బస్తీలకు చేరువ చేసే దిశగా కీలకమైన ముందడుగు వేసింది తెలంగాణ ప్రభుత్వం. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా.. పౌరసేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకే వార్డు కార్యాలయాలను ప్రారంభిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. పరిపాలన వికేంద్రీకరణ, ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా ఈ వార్డు కార్యాలయాలు పనిచేస్తాయని మంత్రి వెల్లడించారు. పురపాలన సంస్కరణల్లో దీనినో ముఖ్యమైన ఘట్టంగా ఆయన పేర్కొన్నారు . తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో పట్టణ ప్రగతి వేడుకలలో భాగంగా కాచిగూడలో వార్డు కార్యాలయం ప్రారంభించిన తర్వాత మాట్లాడుతూ.. ఒక్కో వార్డులో 10మంది అధికారులు అందుబాటులో ఉంటూ ప్రజలుకు మెరుగైన, సులభమైన సేవలు అందిస్తారని చెప్పారు. ఈ కార్యక్రమం విజయవంతమైతే దేశంలోని అన్ని చోట్ల నుంచి హైదరాబాద్‌కు వచ్చి నేర్చుకుని వెళ్లే పరిస్థితి ఉంటుందని చెప్పారు. మరి ఆ సంకల్పం నెరవేరాలంటే ఇకపై సాగాల్సిన కార్యాచరణ ఏమిటి? పౌర సేవల్లో వార్డు కార్యాలయాలు ఏం సవాళ్లు దాటాలి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని