Prathidwani Debate on Ragging Issue in Colleges : విద్యాలయాల్లో ర్యాగింగ్ భూతం కట్టడి ఎలా? - ర్యాగింగ్ నిర్మూలన
🎬 Watch Now: Feature Video
Published : Sep 29, 2023, 9:36 PM IST
Prathidwani Debate on Ragging Issue in Colleges : కళాశాలల్లో ర్యాగింగ్ భూతం కలకలం సృష్టిస్తోంది. కొన్నేళ్లుగా స్తబ్ధుగా ఉన్న ఈ వికృతక్రీడ మళ్లీ జడలు విప్పుతుండడానికి కారణం ఏమిటి? ర్యాగింగ్ నియంత్రణకు ఉన్న చట్టాలు, నిబంధనలు అమలుతీరును వరుస ఘటనలు ప్రశ్నిస్తున్నాయి. కళాశాలల్లో సహృద్భావ వాతావరణం ఎందుకు ఉండట్లేదు? విద్యాసంస్థలు ఎందుకు పటిష్ఠంగా అమలు చేయలేక పోతున్నాయి? యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్‌లు, రాత్రివేళల్లో నిఘా పెట్టాల్సిన బృందాలు పనిచేస్తున్నాయా? సీనియర్ల ఏ ఏ చర్యలు ర్యాగింగ్ నిర్వచనం కిందకు వస్తాయి?
How to Eliminate Ragging : వేధింపులపై జూనియర్ విద్యార్థులు ఎవరికి, ఎలా ఫిర్యాదు చేయాలి? ర్యాగింగ్‌కు పాల్పడినట్లు రుజువైతే సదరు విద్యార్థులు ఎలాంటి శిక్షలు, పర్యవసానాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది? ఈ విషయంలో అవగాహనకు ఏం చేయాలి? జరుగుతోన్న ఘటనలు ఎవరి వైఫల్యాన్ని ఎత్తి చూపుతున్నాయి? ర్యాగింగ్ నిరోధకచట్టం నిబంధనలు ఏం చెబుతున్నాయి? బాధిత విద్యార్థులే కాదు ప్రతి విద్యార్థి తల్లిదండ్రుల మదిలో మెదులుతోన్న ర్యాగింగ్ భయాలకు అడ్డుకట్ట వేసేది ఎలా? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.