Prathidwani: అందరి దృష్టిని అకర్షిస్తున్న జాతీయ రాజకీయాలు - మోదీని గద్దెదించాలని ఇండియా
🎬 Watch Now: Feature Video
Prathidwani: వరుసగా మూడో సారి అధికారం అందుకోవాలని ఎన్డీఏ.. ఎలాగైనా నరేంద్ర మోదీని గద్దె దించాలని ఏకతాటిపైకి చేరుతున్న విపక్షాలు.. కొన్నాళ్లుగా జాతీయ రాజకీయాల్లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న రాజకీయ పరిణామాలివి. ఇప్పుడు 38 పార్టీలతో దిల్లీలో ఎన్డీఏ,.. 26 పార్టీలతో బెంగళూరులో విపక్ష పార్టీలు చేపట్టిన భేటీలు ఆ వేడిని మరింత పెంచాయి. ఒక రకంగా చెప్పాలంటే ఇరుపక్షాల ఈ మెగా భేటీలు బల ప్రదర్శననే తలపించాయి. అయితే వారి ఉద్దేశాలు స్పష్టంగానే ఉన్నా.. విధానాలు, అందుకు కలసి వచ్చే వ్యూహాలపైనే అందరి ఆసక్తి నెలకొంది. ఈ విషయంలో NDA, I-N-D-I-A కూటముల్లో ఎవరు ఎక్కడ ? రానున్న రోజుల్లో ఈ సమీకరణాలు ఎలా మారే అవకాశం ఉంది ? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని చర్చ చేపట్టింది. ఈ చర్చలో సీనియర్ పాత్రికేయులు రాకా సుధాకర రావు, రాజకీయ, సామాజిక విశ్లేషకులు టి. లక్ష్మీ నారాయణ పాల్గొని వారి అభిప్రాయాలను తెలియజేశారు.