Prathidwani : 'కల్తీ' కట్టడికి ప్రభుత్వం తీసుకోవాల్సిన తక్షణ చర్యలేంటి..? - ఆహార కల్తీ అంశంపై ప్రతిధ్వని చర్చ
🎬 Watch Now: Feature Video
prathidwani : రాష్ట్రంలో ఆహార పదార్థాల నాణ్యత గాలిలో దీపంలా మారింది. హోటళ్లు, రెస్టారెంట్లు, తిను బండారాల విక్రయ కేంద్రాలు భారీ సంఖ్యలో పెరుగుతున్నా.. ఆ మేరకు తనిఖీ వ్యవస్థ బలోపేతం కాకపోవడమే దీనికి కారణం. ఫలితంగా తనిఖీలు నామమాత్రంగా ఉంటున్నాయి. దీంతో కాదేది కల్తీకి అనర్హం అన్నట్టు పిల్లలు తాగే పాల నుంచి.. రోజువారీ ఆహారం వరకు ప్రతీది కల్తీ చేస్తున్నారు కల్తీ రాయుళ్లు. రోజురోజుకూ ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) 2021-22 సంవత్సరానికి విడుదల చేసిన ఆహార నాణ్యత సూచీలో తెలంగాణకు దేశంలోని 17 పెద్ద రాష్ట్రాల్లో 15వ స్థానం దక్కడం పరిస్థితికి నిదర్శనం. అయితే.. ఈ కల్తీ ముఠాలను నిరోధించేందుకు కఠిన చట్టాలున్నా.. అనుకున్న ఫలితాలు సాధించలేకపోవడానికి కారణాలేంటి? కల్తీలను ఎందుకు అరికట్టలేకపోతున్నాం..? ఆహార పదార్థాల్లో కల్తీల వల్ల ప్రజల ఆరోగ్యానికి ఎలాంటి ముప్పు వాటిల్లుతోంది..? తక్షణం ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు ఏంటి..? పౌర సమాజంలో ఎలాంటి అవగాహన కలిగించాలి..? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.