Prathidwani అదానీ ఉదంతం మదుపర్లకు చెబుతోన్న పాఠమేంటి - hindenburg report on adani groups
🎬 Watch Now: Feature Video
Prathidwani వారం వ్యవధిలో కరిగిపోయిన సంపద విలువ రూ.100 బిలియన్ డాలర్లకు పైగా. మన కరెన్సీలో చెప్పాలంటే అక్షరాలా రూ.8.76 లక్షల కోట్ల పైమాటే. అందులో మదుపర్లు పోగొట్టుకున్న సంపద విలువ రూ.4.4 లక్షల కోట్లకు పైగా. దేశీయ స్టాక్ మార్కెట్‌లో ఇటీవల కాలంలో కనీవినీ ఎరగని ఈ నష్టాన్ని నమోదు చేశాయి అదానీ గ్రూప్ సంస్థల షేర్లు. సరిగ్గా వారం క్రితం హిండెన్‌బెర్గ్ నివేదిక రూపంలో తాకిన ఈ ఉపద్రవం ప్రభావం ఇంకా కొనసాగుతూనే ఉంది. దలాల్ వీధిలో మొదలైన ఈ ప్రకంపనలు పార్లమెంట్‌ను కూడా కుదిపేస్తున్నాయి. మరి సగటు మదుపర్లకు అదానీ ఉదంతం చెబుతున్న పాఠం ఏమిటి. ఈ ముసలానికి ముగింపు ఎక్కడ. ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.