Prathidwani : మరోసారి చర్చనీయాంశంగా యాచక ముఠాలు.. పూర్తిస్థాయిలో ఈ మాఫియా ఆటకట్టించాలంటే ఏం చేయాలి? - hyderabad latest news

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Aug 22, 2023, 9:29 PM IST

Prathidwani Debate on Begging Mafia in Hyderabad : హైదరాబాద్​లో ఇటీవల బెగ్గింగ్ మాఫియా చర్చనీయాంశంగా మారింది. భాగ్యనగరంలో యాచక ముఠాల ఆగడాలు కొనసాగుతూనే ఉన్నాయి. నగరంలో వీరి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతూనే ఉంది. కొందరు వ్యక్తులు మాఫియాగా ఏర్పడి చిన్నపిల్లలు, వృద్ధులు, హిజ్రాలకు డబ్బు ఆశ చూపి యాచకులుగా మారుస్తున్నారు. ట్రాఫిక్​ కూడళ్లు, రోడ్లపై వాహనదారులకు ఇబ్బంది కలిగిస్తున్నారు. ఛారిటీలకు ఆర్ధిక సహాయం చేయండి.. అంటూ మాయామాటలు చెబుతూ డొనేషన్​ బాక్స్​లతో తిరుగుతున్న ముఠాను టాస్క్​ఫోర్స్​ పోలీసులు పట్టుకున్నారు. వీరి సంపాదన ఎంతలా ఉందంటే.. హైదరాబాద్​లో కోట్ల విలువైన ప్లాట్లు​ కొనుగోలు చేయడం గమనార్హం. 2017 నుంచి నగరాన్ని బెగ్గర్ ఫ్రీ సిటీ దిశగా మార్చేందుకు జీహెచ్​ఎంసీ ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ దిశగా సఫలీకృతం కాలేకపోయింది. అసలు ఇక్కడ యాచక మాఫియా ఎందుకు పెరుగుతోంది. అసలు వారంతా ముఠాల వలలో ఎలా చిక్కుకుంటున్నారు. పూర్తిస్థాయిలో ఈ మాఫియా ఆటకట్టించాలంటే ఏం చేయాలి? అభాగ్యులు, యాచకుల పునరావాసానికి ఏం చేయాలి ఇదే నేటి ప్రతిధ్వని

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.