Prathidwani : సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్‌గా మారిన 5 రాష్ట్రాల ఎన్నికలు.. అసలేం జరుగుతోంది? - 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వార్తలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telugu Team

Published : Oct 31, 2023, 10:09 PM IST

Prathidwani Debate on 5 States Assembly Elections : సార్వత్రిక ఎన్నికలకు అసలైన సెమీఫైనల్‌గా ఇప్పటికే దేశవ్యాప్తంగా కాక రేపుతున్నాయి.. 5 రాష్ట్రాల ఎన్నికలు. రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్, మిజోరాం సహా తెలంగాణలో జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు తమ బలాబలాల్ని ప్రదర్శించి తలరాతను పరిక్షించుకోనున్నాయి. 2024కి సెమీ ఫైనల్‌గా భావిస్తున్న ఈ ఎన్నికల్లో బీజేపీ - కాంగ్రెస్ కూడా అదే స్థాయిలో తలపడుతున్నాయి. ఆ నేపథ్యంలో రెండు పార్టీలు రానున్న సార్వత్రికానికి ప్రస్తుత ఎన్నికల్ని ప్రయోగశాలగా ఉపయోగించు కుంటున్నాయా..?

ఈ 5 రాష్ట్రాల్ల్లో జరిగే ఈ అసెంబ్లీ ఎన్నికలు 2024 లోక్‌సభ ఎన్నికలపై ప్రభావం చూపుతాయనడం ఏ మాత్రం అతిశయోక్తి కాదు. మరి ఈ నేపథ్యంలో అసలు ఆయా రాష్ట్రాల్లో ఏం జరుగుతోంది. రేసులో ఉన్న ప్రధానపార్టీలు ఓటర్లను ఏ విధంగా ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి? పార్టీలకు విజయావకాశాలు ఎలా ఉన్నాయి? గతంలో మధ్యప్రదేశ్, రాజస్థాన్ కాంగ్రెస్ గెలిచినా లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ క్లీన్‌స్వీప్ చేసింది. ఇప్పుడు ఆ పరిస్థితి ఉంటుందా? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.