త్వరలోనే నూతన పారిశ్రామిక విధానం - తమదైన ముద్ర వేసే ప్రయత్నాల్లో కొత్త ప్రభుత్వం - prathidwani latest news

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Jan 11, 2024, 10:18 PM IST

Prathidhwani on Industrial Policy : ముందు నుంచి చెబుతున్నట్లే పరిశ్రమలు, పారిశ్రామిక విధానం విషయంలో తమదైన ముద్ర వేసే ప్రయత్నాల్లో వడివడిగా అడుగులు వేస్తోంది కొత్త ప్రభుత్వం. ఇప్పటికే రాష్ట్రంలో పెట్టే ప్రతి పైసా పెట్టుబడికి భరోసా కల్పిస్తామని అంటోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ పారిశ్రామిక ప్రగతిని కొత్తపుంతలు తొక్కిస్తామని హామీ ఇచ్చారు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి. అందుకు కొనసాగింపుగా రాష్ట్రానికి త్వరలోనే నూతన ఇండస్ట్రియల్ పాలసీ తీసుకొస్తామని ప్రకటించారు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు. అందుకోసం అందరి సలహాలు, సూచనలు స్వీకరిస్తామన్నారు.  

Debate on Industries in Telangana : మరి ఈ విషయంలో ప్రభుత్వం నుంచి పరిశ్రమలు ఏం కోరుకుంటున్నాయి? తెలంగాణ పరిశ్రమలంటేనే అందరిదృష్టి ఐటీ, ఫార్మా, డిఫెన్స్, ఏరోస్పేట్, వేల కోట్ల పెట్టుబడులపైనే ఉంటుంది. అయితే చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ఎలా ఉన్నాయి? వాటికేం కావాలి? త్వరలోనే రాష్ట్రబడ్జెట్‌ కూడా సిద్ధం కానుంది. ప్రభుత్వం వైపు నుంచి ముఖ్యమంత్రి, పరిశ్రమల  శాఖ మంత్రి కల్పిస్తున్న ఆశలకు అనుగుణంగా బడ్జెట్‌ నుంచి పారిశ్రామికరంగం ఏం ఆశిస్తోంది? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.  

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.