లవర్‌తో పెళ్లికి నో చెప్పిన పెద్దలు ట్యాంక్ ఎక్కి మైనర్ రచ్చరచ్చ - ప్రేమ పెళ్లికి నిరాకరించారని ట్యాంక్ ఎక్కిన యువతి
🎬 Watch Now: Feature Video
ప్రియుడితో పెళ్లికి నో అన్నారని నీటి ట్యాంక్ ఎక్కింది ఓ యువతి. వివాహానికి ఓకే చెప్పేంత వరకు కిందకు దిగనని మారం చేసింది. సమయానికి ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పెద్దలను ఒప్పించి వారి పెళ్లి చేస్తామని హామీ ఇచ్చారు. పోలీసుల మాటలు విన్న ఆ యువతి ఎట్టకేలకు ట్యాంక్ దిగి కిందకు వచ్చింది. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్‌లో జరిగింది. అయితే మూడు నెలలుగా ప్రేమలో ఉన్న ఈ జంట డిసెంబర్ 8న పరారైంది. అలా ముంబయిలో తల దాచుకున్న ఆ ఇద్దరి విషయం కుటుంబసభ్యులకు తెలియగా డిసెంబర్ 16న ప్రతాప్‌గఢ్‌కు వారిని తిరిగి తీసుకొచ్చారు. పెళ్లికి అబ్బాయి తరఫు వారు నిరాకరించడం వల్ల యువతి ట్యాంక్ ఎక్కింది.
Last Updated : Feb 3, 2023, 8:36 PM IST