రెండో రోజు అదే ఉత్సాహం - ప్రజాదర్బార్‌కు విశేష స్పందన - హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో ప్రజాదర్బార్
🎬 Watch Now: Feature Video
Published : Dec 9, 2023, 3:41 PM IST
Praja Darbar Second Day in Jyotirao Phule Praja Bhavan at Hyderabad : హైదరాబాద్‌లోని మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్‌లో శనివారం నిర్వహించిన రెండోరోజు ప్రజాదర్బార్‌కు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. వృద్ధులు, దివ్యాంగులు, మహిళలు పెద్ద ఎత్తున ప్రజాదర్బార్(Praja Darbar)కు హాజరయ్యారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన ప్రజల నుంచి ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి, సీసీఎల్ఏ కమిషనర్ నవీన్ మిత్తల్ వినతులు స్వీకరించారు. స్వయంగా ఆయనే అప్లికేషన్లు స్వీకరిస్తూ ప్రజలు ఇచ్చిన విజ్ఞాపనలను నమోదు చేసుకున్నారు. ఈ ప్రజా సమస్యలు అన్నింటినీ పరిష్కరించడానికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు ఆయన తెలిపారు.
Jyotirao Phule Praja Bhavan at Hyderabad : ఆయనతో పాటు హైదరాబాద్ అదనపు కలెక్టర్ మధుసూదన్, జీహెచ్ఎంసీ అధికారులు ముషారఫ్ అలీ, రవికుమార్‌లు ప్రజా దర్బార్ నిర్వహణను సమన్వయం చేశారు. ప్రజలు తమ అవసరాలను తీర్చాలని ప్రజా దర్బార్ ద్వారా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు. చాలా మంది ఇదే ప్రగతి భవన్ నిర్మించిన తర్వాత రావడం అంటూ హర్షం వ్యక్తం చేశారు. తమ సమస్యలను ప్రభుత్వానికి తెలిపామని చెప్పారు.