Posters Against Madhu yashki : సేవ్ ఎల్బీనగర్ కాంగ్రెస్.. గోబ్యాక్ టు నిజామాబాద్.. మధుయాష్కీకి వ్యతిరేకంగా పోస్టర్లు - Gandhi Bhavan latest news
🎬 Watch Now: Feature Video
Published : Sep 4, 2023, 5:10 PM IST
Posters against congress leader Madhu Yashki at Gandhi Bhavan : నిజామాబాద్ మాజీ ఎంపీ, ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీకి వ్యతిరేకంగా గాంధీ భవన్‌లో వెలసిన పోస్టర్లు కలకలం రేపాయి. సేవ్ ఎల్బీనగర్ కాంగ్రెస్, గోబ్యాక్ టు నిజామాబాద్, పారాచూట్ నాయకులకు టికెట్ ఇవ్వొద్దంటూ పార్టీ రాష్ట్ర కార్యాలయం వద్ద గుర్తు తెలియని వ్యక్తులు పోస్టర్లు అంటించారు.
కాంగ్రెస్‌లో టికెట్ల ఖరారు చేసేందుకు పీసీసీ ముమ్మర కసరత్తు చేస్తున్న వేళ...ఆశావహులు వివిధ రూపాల్లో తమ అభిప్రాయాలను అధిష్ఠానానికి తెలియజేస్తున్నారు. ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీకి వ్యతిరేకంగా గాంధీ భవన్ వద్ద పోస్టర్లు వెలిశాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్బీనగర్ నుంచి పోటీ చేసేందుకు ఆయన దరఖాస్తు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో సేవ్ ఎల్బీనగర్ కాంగ్రెస్, గోబ్యాక్ టు నిజామాబాద్, పారాచూట్ నాయకులకు టికెట్ ఇవ్వొదంటూ గాంధీభవన్ గోడలపై పోస్టర్లు అంటించడం ఆ పార్టీలో చర్చనీయాంశంగా మారింది.