Ponnala Lakshmaiah Interview : కాంగ్రెస్‌లో పెరిగిన బీసీ నినాదం.. అత్యధిక సీట్లు కేటాయించాలని డిమాండ్ - Seat allocation controversy in Telangana Congress
🎬 Watch Now: Feature Video
Ponnala Lakshmaiah on Seats allotment in Congress : రాష్ట్రంలో ఎన్నికల వేడి మొదలైంది. ఇప్పటికే కొన్ని పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతు ఎన్నికల బరిలో దిగేందుకు సిద్ధంకాగా.. మరికొన్ని పార్టీలు పొత్తులతో బలం పెంచుకునేందుకు సిద్ధమవుతున్నాయి. కర్ణాటక ఎన్నికల ఫలితాలు అనంతరం కాంగ్రెస్‌లో ఒక్కసారిగా ఊపు వచ్చింది. దానికి తోడు సీనియర్ నాయకులు పొంగులేటి, జూపల్లి చేరికలతో ఈ ఉత్సాహం మరింత రెట్టింపయ్యింది. ఈ క్రమంలో ఎన్నికలు ఎప్పుడు పెట్టిన తమ పార్టీ సిద్దమంటు హస్తం నేతలు స్పష్టమైన సంకేతాలు ఇస్తున్నారు. ఈసారి తమ విజయాన్ని ఎవరు ఆపలేరని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆ పార్టీలో సీట్ల వివాదం మెల్లమెల్లగా వెలుగులోకి వస్తోంది. ఈసారి బీసీలకు అత్యధిక సీట్లు కేటాయించాలన్న నినాదం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కొన్ని రోజులుగా బీసీ నాయకులు ప్రత్యేకంగా సమావేశమవుతూ చర్చించడంతో పాటు.. జనాభా ప్రాతిపదికన సీట్లు ఇవ్వాలని అధిష్ఠానానికి విజ్ఞప్తి చేయాలని నిర్ణయించారు. ఇతర పార్టీల్లో వెనకబడిన కులాలకు అధిక స్థానాలు ఇస్తున్నారని.. కాంగ్రెస్‌లో కూడా ఇవ్వాలని కోరుతున్నారు. దీనిపై మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఏం అంటున్నారో ఇప్పుడు చుద్దాం.