కేసీఆర్​ చెంప చెళ్లుమనేలా- కాంగ్రెస్​ పార్టీ పక్షానే ప్రజల ప్రయాణం : పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి - తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2023

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Nov 12, 2023, 8:39 PM IST

Ponguleti Srinivas Reddy Fires on CM KCR : తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి మూడోసారి ముఖ్యమంత్రి కావాలనుకునే కేసీఆర్​ చెంపచెళ్లు మనిపించే విధంగా.. ప్రజలు కాంగ్రెస్ పక్షాన ప్రయాణం చేస్తున్నారని పాలేరు అభ్యర్థి, కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి పేర్కొన్నారు. ఖమ్మం రూరల్ మండలం సత్యనారాయణపురంలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతూ.. వైఎస్సార్ తెలంగాణ పార్టీ ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు.

Telangana Election Polls 2023 : అనంతరం పొంగులేటి మాట్లాడుతూ.. మూడోసారి ముఖ్యమంత్రి కావాలని కేసీఆర్ పగటి కలలు కంటున్నాడని ఎద్దేవా చేశారు. వైఎస్ షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టి మూడున్నరవేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి.. నిరుద్యోగులకు అండగా దీక్ష చేశారన్నారు. సీఎం కేసీఆర్​ పాలనపై ప్రజలను చైతన్యవంతం చేయడంతో కీలక పాత్ర పోషించారని తెలిపారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలొద్దని, కాంగ్రెస్​కు నష్టం జరగొద్దనే మంచి మనసుతో.. హస్తం పార్టీకి మద్దతు ఇవ్వడం హర్షణీయమని వివరించారు. పక్క పార్టీ గురించి కానీ పక్క నాయకుడి గురించి కానీ ఆలోచించని ఈ రోజుల్లో.. కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుందని షర్మిల ఆలోచించారని పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి అన్నారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.