ఆరు బస్సుల్లో 30 కేజీల గంజాయి తరలింపు - అబ్దుల్లాపూర్‌మెట్ వద్ద 10 మంది అరెస్ట్ - Ganja Seized Hyderabad
🎬 Watch Now: Feature Video
Published : Jan 12, 2024, 8:45 AM IST
Police Seized Ganja at Abdullahpurmet : ఏపీ నుంచి హైదరాబాద్‌కు బస్సుల్లో తరలిస్తున్న గంజాయిని ఎక్సైజ్ పోలీసులు సీజ్ చేశారు. 10 మంది స్మగ్లర్లను అరెస్టు చేశారు. వేర్వేరు బస్సుల్లో తరలిస్తుండగా, 30 కిలోలకు పైగా స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ ఏడున్నరల లక్షల వరకు ఉంటుందని అంచనా వేశారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ వద్ద అబ్కారీశాఖ సోదాలు చేపట్టింది. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీలు చేసిన ఎక్సైజ్ అధికారులు, ఆరు వేర్వేరు బస్సుల్లో 30 కిలోలకు పైగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఏపీ నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్న నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
Police Seized 30 KGs Ganja in Hyderabad : వివిధ రాష్ట్రాలకు చెందిన నిరుద్యోగ యువత ఇలా గంజాయి కొరియర్లుగా పనిచేస్తున్నారని పోలీసులు వెల్లడించారు. ఏజెన్సీ ఏరియాల నుంచి బస్సుల ద్వారా నగరానికి మత్తుపదార్థాలను చేరవేస్తున్నారన్నారు. పాడేరు, నర్సీపట్నం, విశాఖ నుంచి గంజాయి తీసుకువస్తున్న నిందితులు, నగరం మీదుగా దిల్లీకి తరలిస్తున్నట్లు గుర్తించామని పోలీసులు తెలిపారు. ఇలాంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అదుపులోకి తీసుకున్న నిందితులను హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.