Police protection for tomatoes : అదుపు తప్పిన టమాటా లారీ.. ఎగబడిన జనం.. పాపం చివరికి ఏమైందంటే! - Tomato theft

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 24, 2023, 3:45 PM IST

Tomato theft In Kumaram Bheem Asifabad : ఇటీవల కాలంలో టమాట ధరలు ఆకాశానికి అందడంతో వాటికి ఒక్కసారిగా మార్కెట్లో రెక్కలు వచ్చాయి. టమాటా ధరలు అమాంతంగా పెరగడంతో సాధారణ ప్రజానికానికి టమాట అనే పదం వినిపిస్తే జర్వం వస్తోంది. దీంతో టమాట కంటికి కనబడగానే దొంగతనం చేసైనా సరే వండుకోని తినాలని కొందరికి అనిపిస్తోంది. అంతా ఆశగా ఎదురు చూస్తున్న టమాట ప్రియులకు టమాట లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడిందనే విషయం చెవిన పడింది. దీంతో వారి ఆనందానికి అవధులు లేవు. సంతోషంతో ప్రజలు తండోపతండాలుగా ఘటన స్థాలానికి చేరుకున్నారు. పాపం అక్కడికి వెళ్లగానే పోలీసులు లాఠీలు పట్టుకొని టమాట లారీకి బందోబస్తుగా ఉన్నారు. పాపం ఎంతో ఆశపడ్డ వారు వెనుదిరగాల్సి వచ్చింది. ఈ ఘటన కుమురం భీం ఆసిఫాబాద్​ జిల్లా వాంకిడి మండలం బెండర గ్రామ శివారులోని జాతీయ రహదారిపై జరిగింది. లారీ యాజమాని ముందు జాగ్రత్తగా లారీ బోల్తా పడగానే పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు కాపాలాగా ఉన్నారు. చివరికి సరుకంతా వేరే వాహనంలోకి ఎక్కిచేంత వరకు ఖాకీలు రక్షణగా ఉన్నారు. వాహనంలో సుమారు 11టన్నుల టమాటాలు ఉన్నాయి. ప్రమాదంలో డ్రైవర్​కు​ స్వల్ప గాయాలయ్యాయి.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.