బెంగళూరులో మోదీ రోడ్‌షో.. నవ వరుడికి తప్పని తిప్పలు.. మండపానికి సో లేట్! - మోదీ రోడ్ షో ట్రాఫిక్‌లో ఇరుక్కున్న పెళ్లి కొడుకు
🎬 Watch Now: Feature Video
ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన రోడ్ షో కారణంగా బెంగళూరు నగర వాసులు ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పెళ్లి మండపానికి వెళ్లాల్సిన ఓ పెళ్లికుమారుడు.. ట్రాఫిక్‌లో చిక్కుకున్నాడు. వెళ్లనివ్వాలని వేడుకున్నా.. పోలీసులు అనుమతించలేదు. ఈ ఘటన శనివారం జరిగింది.
మోదీ రోడ్ షో నేపథ్యంలో నైస్ రోడ్ జంక్షన్ నుంచి సుమనహళ్లి సర్కిల్ వరకు పోలీసు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సమయంలో కల్యాణమండపానికి వెళ్తున్న వరుడి కారును పోలీసులు అడ్డుకున్నారు. వరుడు పెళ్లి దుస్తులతో, పూల దండతో వచ్చినప్పటికీ అటువైపు వెళ్లేందుకు అనుమతి నిరాకరించారు. అయితే, రోడ్ షో మార్గంలోనే పెళ్లి మండపం ఉంది. దీంతో పెళ్లి దుస్తుల్లోనే వరుడు రోడ్డుపై బైఠాయించాడు. పోలీసులు తీరుపై వరుడు ఆగ్రహం వ్యక్తం చేయడం వల్ల.. పెళ్లి మండపానికి వెళ్లేందుకు పోలీసులు అనుమతించారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మోదీ బెంగళూరులో పర్యటించారు. ఆరురోజుల సుడిగాలి పర్యటనలో భాగంగా శనివారం నగరంలో రోడ్ షో నిర్వహించారు.