'పెద్దపల్లి నియోజకవర్గంలో అభివృద్ధి కంటే అవినీతే అధికం' - కాంగ్రెస్ అభ్యర్థి చింతకుంట విజయరమణారావు
🎬 Watch Now: Feature Video


Published : Nov 9, 2023, 7:11 PM IST
Peddapalli Congress candidate Vijaya Ramana Rao : పెద్దపల్లి నియోజకవర్గంలో అభివృద్ధి కంటే అవినీతే అధికంగా జరిగిందని కాంగ్రెస్ అభ్యర్థి చింతకుంట విజయరమణారావు ఆరోపించారు. రాజీవ్ రహదారికి సుల్తానాబాద్, పెద్దపల్లి పట్టణాల్లో బైపాస్ రోడ్లు నిర్మించకపోవడం వల్ల అనేక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని అన్నారు. నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై తనకు పూర్తి అవగాహన ఉందని పేర్కొన్నారు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మేనిఫెస్టో పట్ల యువత, గృహిణులు ఆకర్షితులౌతున్నారని ఆయన తెలిపారు. నియోజకవర్గంలో చోటు చేసుకుంటున్న అవినీతిని అడ్డుకొనేందుకు ప్రజలతో కలిసి ముందుకు వెళ్తానని చింతకుంట విజయరమణారావు స్పష్టం చేశారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి కచ్చితంగా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజలు పూర్తిగా నమ్మకం కోల్పోయారని.. ప్రస్తుత నియోజకవర్గ ఎమ్మెల్యే అభివృద్ధి పనులు చేయకపోగా అవినీతి కార్యక్రమాలు చేశారని ఆరోపించారు. ఎమ్మెల్యే వైఖరి వల్ల రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేక పెరిగిందని కాంగ్రెస్ వైపే అందరూ మొగ్గుచూపుతున్నారని కాంగ్రెస్ అభ్యర్థి చింతకుంట విజయరమణారావు వివరించారు.