పురివిప్పి నాట్యమాడిన నెమలి.. ఈ మనోహర దృశ్యం మీకోసమే! - ఛత్తీస్గఢ్లో నెమలి నాట్యం
🎬 Watch Now: Feature Video
నెమలి పురివిప్పి నాట్యమాడుతుంటే ఎంతటి వారైన దాని సోయగాని మంత్రమగ్ధులు కావాల్సిందే. ఆ అందం ఎవరినైనా సరే ఇట్టే కట్టిపడేస్తుంది. నెమలి నాట్యం ఆడుతుంటే ఎంత సేపైనా అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంటది. ఛత్తీస్గఢ్లో ఇలాగే ఓ నెమలి పురివిప్పి న్యాట్యం చేసింది. జీవవైవిధ్యానికి ఎంతో పేరుపొందిన కొర్బా జిల్లా ప్రజలకు ఈ అద్భుత దృశ్యం తిలకించే అవకాశం దక్కింది. సోమవారం వనంచల్ ప్రాంతంలోని లెమ్రు అనే గ్రామంలో ఆహ్లాదకర వాతావరణం నెలకొన్నందున ఓ నెమలి పురివిప్పి నాట్యం చేసింది. స్థానికంగా ఉన్న అడవుల నుంచి తరచూ కొన్ని నెమళ్లు గ్రామాల్లోకి వస్తుంటాయి. అయితే అక్కడ ప్రజలు వీటికి ఎటువంటి హానీ చేయరు. దీంతో గ్రామస్థుల మధ్యనే నెమళ్లు కూడా స్వేచ్ఛగా తిరుగుతుంటాయి. సాధారణంగా మగ నెమళ్లు నాట్యం చేస్తుంటాయి. ఈ నాట్యాన్ని చూసిన ఆడ నెమళ్లు దాని వద్దకు వస్తుంటాయి. అది కూడా వాతావరణం ఆహ్లాదకరంగా ఉన్నప్పుడు మాత్రమే మగ నెమళ్లు నాట్యం చేస్తుంటాయి. ఆడ నెమలి కంటే మగ నెమలి చూడడానికి చాలా అందంగా ఉండడమే కాకుండా.. పొడవు కూడా ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం నెమలి నాట్యం చేస్తున్న ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.