పవర్‌ఫుల్‌గా పవన్‌కల్యాణ్ ప్రచార వాహనం చూశారా - జనసేన ప్రచార వాహనం
🎬 Watch Now: Feature Video
జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్త పర్యటన కోసం ప్రచార వాహనం సిద్ధమైంది. హైదరాబాద్‌లోని ఓ గ్యారేజిలో వాహనాన్ని ప్రచారానికి తగ్గట్లుగా మార్పులు చేర్పులు చేశారు. సిద్ధమైన వాహనాన్ని పవన్‌కళ్యాణ్ ఇవాళ పరిశీలించారు. సదరు వాహనానికి సంబంధించిన వీడియో, ఫొటోలను పవన్.. ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. దీనికి వారాహి అనే పేరు పెట్టినట్లు పోస్టులో తెలిపారు. దసరా తర్వాత పవన్ పర్యటన ఉంటుందని మొదట్లో ప్రకటించినా అది 2023కు వాయిదా పడింది. వచ్చే ఏడాది మొదట్లో పర్యటన ఉండే అవకాశముందని జనసేన పార్టీ వర్గాలు తెలిపాయి.
దుర్గాదేవి సప్త మాతృకల్లో ఒకరు... వారాహి: ఈ వాహనానికి వారాహి అమ్మవారి పేరు పెట్టారు. అన్ని దిక్కులను కాచే అమ్మవారిగా పురాణాలు చెబుతాయి. దుర్గా దేవి సప్త మాతృకల్లో వారాహి అమ్మవారు ఒకరు... ఆ సప్త మాతృకలు రక్త బీజుడు అనే రాక్షసుడిని సంహరించారు.
Last Updated : Feb 3, 2023, 8:35 PM IST